శ్రుతి హాసన్ నా బెస్ట్ ఫ్రెండ్: తమన్నా

స్టార్ హీరోయిన్స్ శ్రుతిహాసన్, మిల్కీబ్యూటీ తమన్నా మంచి స్నేహితులు. వీలున్న ప్రతీసారి ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా మ‌రోసారి శ్రుతిహాస‌న్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని త‌మ‌న్నా తెలియ‌జేశారు. ‘‘ఇండస్ట్రీలో నాకు శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. తను నా బెస్ట్ ఫ్రెండ్. ముంబైలో మా ఇంటి దగ్గరనే తన ఇల్లు ఉంటుంది. తను ముంబై వచ్చినప్పుడు కలుసుకుంటూ ఉంటాం. కలుసుకున్నప్పుడు మా జీవితాల గురించి మాట్లాడుకుంటుంటాం. శ్రుతికి నెగెటివిటీ అంటే నచ్చదు. అందువల్లనే మేంఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఇప్పటికీ తను నన్ను ఓ చిన్న పిల్లలా చూస్తుంది’’ అన్నారు తమన్నా.