భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రభుత్వానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అండగా నిలిచింది. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి షియోమీ రూ.15 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని షియోమీ గ్లోబెల్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ఓ లేఖ ద్వారా వెల్లడించారు.
ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి (పీఎం-కేర్స్)కు రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నామని తెలిపిన మను. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు కూడా ఆర్థి సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. అంతేకాక, గివ్ ఇండియ, ఎంఐ.కామ్‌లతో కలిసి భాగస్వామ్యం ఏర్పరుచుకున్నామని తెలిపిన ఆయన.. తద్వారా సేకరించిన విరాళం రూ.కోటితో 20వేల కుటుంబాలకు వైద్య శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు తదితర సామాగ్రిని అందిస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.

షియోమీ భారీ విరాళం