షూటింగ్‌ మొదలెట్టిన మెగా అల్లుడు

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ తన కొత్త సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించాడు. లాక్‌డౌన్‌ సడలింపులతో సినిమా షూటింగ్‌లకు అనుమతి రావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూడియోలో సూపర్‌ మచ్చి సినిమా షూటింగ్‌ మొదలెట్టారు. డైరెక్టర్‌ పులివాసు కల్యాణ్‌దేవ్‌, రచితారామ్‌, అజరులైన చివరి షెడ్యూల్‌ల్లో భాగంగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కల్యాణ్‌ దేవ్‌ విజేత సినిమాతో తెరంగేట్రమ్‌ చేయగా..సూపర్‌మచ్చి రెండో సినిమా. ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.