దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు

సంతోష్‌బాబు కుటుంబానికి కిషన్‌రెడ్డి పరామర్శ