సందీప్‌పై పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు

సందీప్‌పై పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు

సినిమా ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తిపై టాలీవుడ్ యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ అనే వ్యక్తి 45 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశాడంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకెళితే.. 45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్.. కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు ఇచ్చాడని.. అయితే మిగతా డబ్బులు ఇవ్వాలని అడగ్గా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రవి రాసుకొచ్చాడు. అంతేకాదు.. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి చెప్పుకొచ్చాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని ఇవాళ సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.