సమంతకు మరో అవార్డు

సమంత ఖాతాలో మరో అవార్డు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో లైంగిక వివక్షకు గురయ్యే రాజీ అనే తమిళ ఈలం సోల్జర్‌ పాత్రలో అద్భుతంగా నటించిన ఆమెకు ప్రశంసలతో పాటుగా అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి. ఫిలిం ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్‌-2021లో డ్రామా సిరీస్‌ (ఫీమేల్‌) కేటగిరీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు గెలుచుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్బోర్న్‌ (ఐఐఎఫ్‌ఎం-2021) అవార్డు కూడా వరించింది. బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఫిమేల్‌ (సిరీస్‌) కేటగిరీలో సమంత ఈ అవార్డుకు ఎంపికైంది.