సమంతకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కాశ్మీర్‌లో జరగుతుంది. కాగా, ఈనెల 28న సమంత పుట్టిన రోజును పురస్కరించుకొని విజయ్ దేవరకొండ ఆమెకు సర్‌ప్రైజింగ్‌గా విషెస్‌ తెలియజేశారు. దీంతో ఆమె సైతం షాకింగ్‌, ఆనందానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.