లాక్‌డౌన్‌లో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో సినీతారలు శారీరకంగా దృఢపడడానికి కరసత్తులు చేస్తున్నారు. అందులో తెలుగులో నటి సమంత కూడా ఉంది. ఈమె ఒక పక్క జిమ్‌లో కుస్తీలు పడుతూనే మరో పక్క యోగా చేస్తున్నారు. ఆకుకూరలు పండిస్తున్నారు. తాజాగా యోగా సెషన్‌లో ఆమె ప్రదర్శించిన భంగిమను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది కొద్దిగా కష్టమైనదే అయినా సులువుగా చేసేసిందట. ఆ సమయంలో తన భర్త నాగచైతన్య కూడా ఉన్నారు. చైతన్యతో కలసి ఇలా యోగా చేయడం చాలా సంతోషంగా ఉందని ఇన్‌స్టాలో పేర్కొంది.
