సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ సమీక్ష

ఆలస్యం లేకుండా సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో భూముల రీ సర్వేపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు