సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు
సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు

సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు

కరోనా నియంత్రణకు తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. చెన్నైతో సహా పలు నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర సరిహద్దుల్లో గోడలు కట్టేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో గల కాట్పాడి రాయవేలూరులలో 40కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ జిల్లా కలెక్టర్ షణ్ముఖ సుందరం ఆంధ్ర సరిహద్దుల్లోని జాతీయ రహదారి మినహా మిగతా అన్ని దారులు మూసి వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్ల మీద అడ్డంగా గోడలు నిర్మిస్తున్నారు