‘సర్కారు వారి పాట’ ట్విట్టర్‌ ఎమోజీ

మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాటు’ పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందిచిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుది. ఈ క్రమంలో సర్కారు వారి పాట ట్విట్టర్‌ ఎమోజీతో అభిమానులని సర్‌ప్రైజ్‌ చేసింది. ట్విట్టర్‌లో ఒక రీజినల్‌ మూవీ ప్రత్యేక మైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. అంతేకాకుండా చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మే 7న హైదరాబాద్‌ లోని యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరగనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్టైన్మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.