‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు

సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు ఎప్పటికీ తనతో ఉండాలన్నారు. సినిమా దర్శకులు పరశురాం మాట్లాడుతూ ఒక్కడు సినిమాతో ప్రభావితమై ఈ సినిమా చేశానని తెలిపారు. సినిమాను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.