సామాన్యుడి నెత్తిన పెట్రో బాదుడు

 నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారత్‌లోని మోడీ సర్కార్‌ పెట్రోపై బాదుడు షురూ చేసింది. దీంతో ఇంధన ధరలు రికార్డులు బద్దలుకొడుతూ, సామాన్యుడి నెత్తిన భారంగా మారాయి. శుక్రవారం కూడా కేంద చమురు ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర 29 పైసలు, డీజిల్‌ 34 పైసలను ఇంధన సంస్థలు పెంచాయి. మే నెలలో ధరలు పెరగడం ఇది ఎనిమిదో సారి. ఇక ఆయా రాష్ట్రాల్లో వ్యాట్‌, ఇతర పన్నులతో కలుపుకుని ధరల్లో మార్పులు సంతరించుకుంటాయి. వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే…

                                   పెట్రోల్‌               డీజిల్‌

ఢిల్లీ                          రూ. 92. 34        రూ. 82.95
ముంబయి                   రూ. 98.65          రూ. 90.11
చెన్నై                        రూ. 94.09          రూ. 87.81
కోల్‌కతా                     రూ. 92.44          రూ. 85.79