సామాన్యులకి షాక్‌.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర

గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరో షాక్‌నిచ్చాయి. గ్యాస్‌ ధర మరోసారి పెరిగింది. ఈ నెల 1 న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై ధరను పెంచింది. 14 కేజీల సిలిండర్‌ పై రూ.50 వడ్డించింది. ఈ మేరకు దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1052 కు చేరింది. దీనికి డెలివరీ బార్సు తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.