సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్
సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్

సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్

ప్రస్థానం సినిమాతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవకట్టా. అదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు దేవకట్టా సిద్ధమయ్యాడు. మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు.
ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు (గురువారం) జరిగింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై సాయితేజ్‌పై క్లాప్ కొట్టారు. ఈ సినిమా దేవకట్టా శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందట. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.