సాయిధరమ్‌తేజ్‌ శస్త్రచికిత్స విజయవంతం

మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో తేజ్‌కు కంటి, ఛాతీ భాగంలో గాయాలతోపాటు.. కాలర్‌ బోన్‌ కూడా విరిగింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు. ఆదివారం తేజ్‌కు కాలర్‌బోన్‌ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వైద్యులు తెలిపారు. అలాగే సాయితేజ్‌ ఆరోగ్యాన్ని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.