సాయి పల్లవితో మరోసారి జోడి కట్టనున్న శర్వానంద్ ?
సాయి పల్లవితో మరోసారి జోడి కట్టనున్న శర్వానంద్ ?

సాయి పల్లవితో మరోసారి జోడి కట్టనున్న శర్వానంద్ ?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి మ‌రోసారి జోడీగా న‌టించ‌బోతున్నారా? అంటే అవున‌నే సినీ వ‌ర్గాల నుండి స‌మాధానం విన‌ప‌డుతుంది. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమాను నిర్మించిన సుధాక‌ర్ చెరుకూరి నిర్మాణంలో కొత్త‌ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాను కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయట‌. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాత శ‌ర్వానంద్ త‌న కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ట. ఆలోపు కిషోర్ తిరుమ‌ల ప్ర‌స్తుతం రామ్‌తో తెర‌కెక్కిస్తోన్న ‘రెడ్’ చిత్రాన్ని పూర్తి చేసుకుంటాడ‌ట‌.