సిజెఐ గా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

భారత అత్యున్నత న్యాయస్థానం 48 వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేడు ప్రమాణం స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు సిజెఐగా ఉన్న ఎస్‌.ఎ.బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగనున్నారు.