సినీ పరిశ్రమలో కార్యకలాపాలకు అనుమతివ్వండి

సినీ పరిశ్రమ, బుల్లితెరకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని పెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కె.సెల్వమణి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి ఒక లేఖను పంపారు. లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో సినీపరిశ్రమలో పలు కార్యకలాపాలు నిలిచిపోయి 50 రోజులు దాటి పోయందని లేఖలో పేర్కొన్నారు. ఒకప్పుడు ‘వందరోజులు, సిల్వర్‌ జూబ్లీ, డైమండ్‌జూబ్లీ కార్యక్రమాలతో కళకళలాడిన సినీ పరిశ్రమ ఇప్పుడు లాక్‌డౌన్‌లో 50 రోజులుగా చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం 17 పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లే సినీ పరిశ్రమకు కూడా అనుమతులివ్వాలని ఆయన కోరారు. దీంతో 40,50 శాతం కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. విధులు నిర్వహిస్తామని అన్నారు.