సిరివెన్నెల కి ఘన నివాళులు అర్పించిన గూగుల్‌ ఇండియా

3 దశాబ్ధాల పాటు సినీ పరిశ్రమను పాటల పూదోటలో ఓలలాడించిన సిరివెన్నెల మంగళవారం సాయంత్రం నిమోనియాతో మరణించారు. సిరివెన్నెల పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత ఆయన. ప్రతి ఒక్కరూ సిరివెన్నెల లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు.  గూగుల్‌ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. ”సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. Ok Google, play Sirivennela songs  అంటూ ప్రజంట్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌ను తన ట్వీట్‌కు జోడించింది.

Sirivennela కి  ఘన నివాళులు అర్పించిన గూగుల్‌ ఇండియా