‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి మంత్రి పేర్ని నాని నివాళి

‘తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల’ అని ఎపి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ… తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని పేర్కొన్నారు. ఎపి ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఎపి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.