ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్ రావు (84) అనారోగ్యంతో శనివారం మరణించారు. ఓల్డ్ అల్వాల్ మంగాపురిలో రాజేశ్వరరావు పార్థీవ దేహానికి శనివారం కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఓల్డ్ ఆల్వాల్ చేరుకుని అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.

సీఎం కేసీఆర్ ఇంట విషాదం