ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. షెడ్యుల్ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు.
