సీఎం జగన్ కి ఎమ్మెల్యే ఆర్కే లేఖ
సీఎం జగన్ కి ఎమ్మెల్యే ఆర్కే లేఖ

సీఎం జగన్ కి ఎమ్మెల్యే ఆర్కే లేఖ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లేఖ రాశారు. నీరుకొండ కొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు ఐనవోలులో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్దాపన చేశారని, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు. అయితే స్మృతి వనం ఏర్పాటు పనులు ఆగిపోయినట్లు లేఖలో ఆర్కే పేర్కొన్నారు. అదే స్థాయిలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం నీరుకొండలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది రోజున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయాలన్నారు.