సీఎం సహాయక నిధికి కోటి రూపాయలు విరాళముగా ఇచ్చిన లలిత జువెలర్స్

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లలిత జ్యువెలర్‌ సీఎండీ కిరణ్‌కుమార్ బుధవారం‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విరాళం చెక్కును అందచేశారు.