సీఎం సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం
సీఎం సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం

సీఎం సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం

కరోనా వైరస్‌ (కోవిడ్‌ –19) నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం టాలీవుడ్‌ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. అనంతరం శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు.