సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విహెచ్‌కు కరోనా

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విహెచ్‌కు కరోనా

తెలంగాణలో కరోనా రోజురోజుకి ఉధృతమౌతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, విహెచ్‌కు కరోనా నిర్థారణ కావడంతో ప్రైమరీ కాంట్రాక్ట్‌లో ఉన్నవారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో ఇప్పటికే పలువురు టిఆరెస్‌ ఎమ్మెల్యేలు, బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిలకు కరోనో సాకిన సంగతి తెలిసిందే.