నందమూరి బాలకృష్ణ తన 106వ సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బాలకృష్ణ. సినీ వర్గాల సమాచారం మేరకు లారీడ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి భారీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్‌తో బాలకృష్ణ తన తదుపరి సినిమాను చేయబోతున్నాడట. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటున్నారు.

సీనియర్ డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా నిజమేనా ?