సీసీసీ కి ప్ర‌భాస్ భారీ విరాళం
సీసీసీ కి ప్ర‌భాస్ భారీ విరాళం

సీసీసీ కి ప్ర‌భాస్ భారీ విరాళం

కరోనా  వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సీసీసీ-మనకోసం’కు రూ.50 లక్ష‌లను విరాళంగా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది వ‌ర‌కే ప్ర‌భాస్ క‌రోనా వైర‌స్ నివార‌ణా చ‌ర్య‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి మూడు కోట్ల రూపాయ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే.