సునీల్‌కి జోడీగా అనసూయ

అనసూయ యాంకర్‌గా బుల్లితెరపైన రాణిస్తూనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనసూయకు సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందులో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. అడవి శేష్‌ నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. స్పెషల్‌ సాంగ్స్‌, స్పెషల్‌ రోల్స్‌తోనే కాకుండా పలు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ప్రధాన పాత్రల్లోనూ నటించింది అనసూయ. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది.