సుమారు 13 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌ వైరస్‌

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సరికొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి ఈ వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కఠినమైన ప్రయాణ నిబంధనలు ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందడం ఆందోళనకరం. మాలావి రోడ్‌ నుండి టెల్‌ అవీవ్‌కు బస్సులో వచ్చిన ఓ ప్రయాణీకుడి ద్వారా ఓ కేసు వచ్చినట్లు ఇజ్రాయిల్‌ వెల్లడించింది. మరోవైపు కొత్త వైరస్‌ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు పరుగులు పెడుతున్నారు. అయితే ఒమిక్రాన్‌పై టీకాలు ఏమాత్రం ప్రభావితం చేయవన్న ఆందోళనల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, దానికి సమీపాన ఉన్న దేశాల నుండి రాకపోకలపై పలు ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ వైరస్‌ను ఏఏ దేశాల్లో గుర్తించారంటే…?
దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాలోని పలు ప్రావిన్స్‌ల్లో 1,100 మందిపై పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం మంది ఈ కొత్త వైరస్‌ బారిన పడ్డారు.
బోత్సువానా : ఈ దేశంలో 19 కేసులు వెలుగుచూశాయి.
బ్రిటన్‌ : మూడు కేసులు బయటపడగా.. ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వారి వల్ల సోకినవే.
జర్మనీ : రెండు కేసులు… దక్షిణాఫ్రికా నుండి మునిచ్‌ వచ్చిన వారిలో గుర్తించారు.
నెదర్లాండ్‌ : 13 కేసులను గుర్తించారు.
డెన్మార్క్‌ : రెండు కేసులు
బెల్జియం : ఒక కేసు
ఇజ్రాయిల్‌ : ఒకటి నిర్ధారణైంది. మరొకరి సోకినట్లు అనుమానిస్తున్నారు.
ఇటలీ : ఒకటి.. అయితే పాజిటివ్‌ నిర్ధారణ కావడానికి ముందు దేశాన్ని చుట్టివచ్చినట్లు తెలుస్తోంది.
చెక్‌ రిపబ్లిక్‌ : ఒకటని స్థానిక మీడియా చెబుతోంది
హాంగ్‌కాంగ్‌ సర్‌ : క్వారెంటైన్‌ హోటల్‌లో రెండు కేసులు వెలుగు చూశాయి.
ఆస్ట్రేలియా : సౌత్‌వేల్‌ స్టేట్‌లో రెండు కేసులు బయటపడ్డాయి.
కె నడా : నైజీరియా నుండి వచ్చిన వారిలో ఇద్దరికీ వైరస్‌ సోకింది.