ఒక్క ట్వీట్‌తో ఎంతో మంది సమస్యలను తీర్చి.. భారత ప్రజల చేత ‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ మొదటి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ ట్విటర్ అకౌంట్లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్ షేర్ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని ఙ్ఞప్తికి తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసేందుకు చేతిలో నైఫ్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’ రూపం చూసి.. ‘‘ సూపర్ మామ్.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు.

సుష్మ స్వరాజ్ భర్త ఎమోషనల్ ట్వీట్