సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ
సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. సోనియా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. గురువారం ఉదయం ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కాగా, త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుదన్న నేపథ్యంలో సోనియాను కోమటిరెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడి రేసులో తాను ఉన్నానని కోమటిరెడ్డి ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చిస్తానని ఇటీవల ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.