సోనూసూద్‌ ‘ఆక్సిజన్‌ ప్లాంట్లు’

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. దీంతో హీరో సోనూసూద్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కు ఆర్డర్‌ చేశామని, మరో 10-15 రోజుల్లో అక్కడ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ రాబోతున్నట్లుగా సోనూసూద్‌ తెలిపాడు. ఇంకొన్ని దేశాల నుంచీ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.