సోమిరెడ్డి కి సవాల్ విసిరిన కాకాని
సోమిరెడ్డి కి సవాల్ విసిరిన కాకాని

సోమిరెడ్డి కి సవాల్ విసిరిన కాకాని

స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నామినేషన్‌ వేయనీయకుంటే వేలాది మంది టీడీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో దానికి తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. అప్పట్లో అదనపు డీజీ వెంకటేశ్వరరావు దగ్గర ఉంటూ వైఎస్సార్సీపీ నేతలను పలు రకాలుగా హింసించి, తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోలేదా అని, అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. టీడీపీ తరపున పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దమ్ము.. ధైర్యం.. నిజాయితీ.. ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.