సోషల్‌ డైలమా చూశా.. భయమేసింది.. సమంత

సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం వల్ల ప్రయోజనం ఎంతో నష్టమూ అంతే. ఏ చిన్న అవకాశం దొరికినా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యక్తిగత సమాచారాన్నంతా లాగేసి ఇబ్బంది పెట్టే వ్యక్తులు బాగా పెరిగిపోయారు. ఈ విషయంలో సెలబ్రెటీలైన తమకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని అంటోంది హీరోయిన్‌ సమంత. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ మధ్య ‘సోషల్‌ డైలమా’ అనే డాక్యుమెంటరీ చూశానని.. అది చూసినపుడు చాలా భయం కలిగిందని.. ప్రస్తుతం మన జీవితాలను ‘డేటా’ అనే అంశం శాసిస్తోందని.. వ్యక్తులకు ప్రైవేట్‌ లైఫ్‌ అన్నదే లేకుండా పోయిందని ఆమె అంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై సమంత వివరంగా మాట్లాడింది.