సోషల్ మీడియా సాక్షిగా అనసూయకు వేధింపులు
సోషల్ మీడియా సాక్షిగా అనసూయకు వేధింపులు

సోషల్ మీడియా సాక్షిగా అనసూయకు వేధింపులు

ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్‌ చేశారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు.