డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం ఇదే తొలిసారి. రాజభవన్లో స్టాలిన్ చేత గవర్నర్ బనర్విలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాబరంబరంగా కొద్దీ మంది అతిధుల మధ్యలో ఈ కార్యక్రమం సాగింది. ఆయనతో పాటు మరో 33 మంది క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన భార్య దుర్గ, కుమారుడు, చెపాక్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే ఉదయ్ నిధి స్టాలిన్, సోదరి, లోక్సభ ఎంపి కణిమొళి కూడా హాజరయ్యారు. హోం శాఖ బాధ్యతలను కూడా ఆయన స్వీకరిస్తూ…ప్రమాణం చేశారు.
