సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు.. ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయంలో ఇందుకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చని వెల్లడించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇసుక రీచ్‌లను తెరవాలని అధికారులను ఆదేశించారు. జూన్ చివరి నాటికి రోజుకు 3లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అదే విధంగా వర్షాలు కురిసే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త వనరులను గుర్తించి మరిన్ని ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి’’అని సీఎం జగన్ పేర్కొన్నారు
