మహమ్మారి కరోనా (కోవిడ్-19) పై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్ యువరాణి, ప్రిన్స్ కార్ల్ ఫిలిప్ భార్య సోఫియా (35) ముందుకు వచ్చారు. మూడు రోజుల ఇంటెన్సివ్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్ అవతారమెత్తారు. తాను అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోఫియామెట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె నేరుగా కోవిడ్-19 పేషెంట్లకు సేవలు అందించారు కానీ వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని ది రాయల్ సెంట్రల్ వెల్లడించింది. ఈ మేరకు… ”ఈ సంక్షోభంలో యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందిని అధిక భారం నుంచి విముక్తి చేయాలని భావించారు” అని రాయల్ కోర్టు ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొంది.
