హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రారంభం

దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఎఎంసి) హైదరాబాద్‌లో ప్రారంభమయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రారంభించారు. వీరితో పాటు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సెంటర్‌ను సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణకు సిఎం కెసిఆర్‌ అప్పగించారు. ఇద్దరూ కలిసి ఐఎఎంసిలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలో సొంత భవనం నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌, హౌం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.