హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ఖాన్‌

సల్మాన్‌ ఖాన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్‌, వ్యక్తిగత సిబ్బంది తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. కరోనా బారినపడ్డారు. సల్మాన్‌ఖాన్‌ వారిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. తాను కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌ పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉండి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట్లో షేర్‌ చేశారు.