అందువల్లనే కరోనా వచ్చింది - తమ్మినేని సీతారాం
అందువల్లనే కరోనా వచ్చింది - తమ్మినేని సీతారాం

అందువల్లనే కరోనా వచ్చింది – తమ్మినేని సీతారాం

సనాతన సంస్కృతి సంప్రదాయాలను గాలికొదిలేయడంవల్లే కరోనా లాంటి వ్యాధులు సోకుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంస్కృతిలోనే రోగాలకు నివారణ మార్గం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాదిమంది ప్రజలు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారని అన్నారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధులతో చాలా మంది చనిపోయారని, ఈ వ్యాధులన్నింటిని అతిక్రమించి.. విజయం సాధించామన్నారు.అయితే ప్రజలు సంప్రదాయాలను వదిలి.. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడడంవల్లే ఈ అనర్థాలు వస్తున్నాయని తమ్మినేని అన్నారు. ఎక్కడికో పరిగెడుతున్నామని, అలా పరుగెట్టి.. పరుగెట్టి అలసిపోయి అంటించుకున్న జబ్బే కరోనా వైరస్ అని అన్నారు. ప్రజలు ఆచారాలను పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు సామాజిదూరం పాటించాలని తమ్మినేని సూచించారు.