అంధ గాయకుడు కోమగన్‌ మృతి

అంధ గాయకుడు, స్వరకర్త, రాగప్రియ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకుడు ఎం.జె.సి. కోమగన్‌ (48) అనారోగ్యంతో కన్నుమూశారు. చేరన్‌ దర్శకత్వం వహించిన తమిళచిత్రం ‘ఆటోగ్రాఫ్‌’ మూవీలో అంధ గాయనీ గాయకులు, వాద్యకారులపై ఓ పాటను చిత్రీకరించారు. కథానాయిక స్నేహ వారి తో కలిసి అందులో ఓ పాట పాడుతుంది. తెలుగు లోనూ ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ చిత్రంలో భూమిక ఆ పాటలో నటించింది. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..’ అంటూ సాగే ఆ ప్రబోధ గీతం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట చిత్రీకరణలో తెలుగులోనూ కోమగన్‌ నటిం చారు.