అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో మోడీకి తొలిస్థానం

మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన దేశాధినేతల్లో తొలి స్థానంలో నిలిచారు. 13 మంది దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, మెక్సికో, దక్షిణకొరియా, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాధినేతలపై ఈ సర్వే చేపట్టింది. అందులో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో 43 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానం, ఆ తర్వాత స్థానాల్లో 43 శాతంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, 41 శాతంతో ఆస్ట్రేలియా అధ్యక్షుడు స్కాట్‌ మారిసన్‌ ఐదవ స్థానంలో ఉన్నారు. ఇటీవల కాలంలో వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ 26 శాతం రేటింగ్‌తో జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు. జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది.