అసెంబ్లీకి రాజీనామా చేసిన బిజెపి ఎమ్మెల్యేలు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో బిజెపికి బలం తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 77 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 75కు తగ్గింది. ఆ ఇద్దరు కూడా బిజెపి ఎంపిలు కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నితీష్‌ ప్రమాణిక్‌, జగన్నాధ్‌ సర్కార్‌ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖలనిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు చేయగల సత్తా ఉన్న ఐదుగురు బిజెపి ఎంపిలను…బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం పోటీ చేయించిన సంగతి విదితమే. వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. బెంగాల్‌లో ఫలితాలు ఆశించిన విధంగా లేవని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఉంటే..తమకు కీలక పదవులు దక్కేవని, ఎంపిలుగా మీ సేవలు పార్లమెంట్‌కు అవసరమని అధిష్టానం చెప్పిన మేరకు తాము ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నామని జగన్నాథ్‌ సర్కార్‌ తెలిపారు.