‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ డైరెక్ట్‌ చేయడానికి హాలీవుడ్‌ దర్శకుడినే రంగంలోకి దింపారు

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మేకింగ్‌ విషయంలో ఎక్కడా రాజీపడరని రాజమౌళికి పేరుంది. దానికితగ్గట్టుగానే ప్రేక్షకుల ఊహకు మించి.. భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌ పార్ట్‌ డైరెక్ట్‌ చేయడానికి హాలీవుడ్‌ దర్శకుడినే రంగంలోకి దింపారు. ఓ రేంజ్‌లో ఈ విషయం ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ.. చిత్రయూనిట్‌ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర బిజినెస్‌ విషయానికొస్తే.. ఏ మూవీకి జరగనంత కనివినీ ఎరుగని రీతిలో ఓ రేంజ్‌లో బిజెనెస్‌ జరుగుతున్నట్లు తెలుస్తుది. స్టార్‌ నెట్‌వర్క్‌వారు ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ను 200 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్‌.