ఇకపై జగనన్న టౌన్‌షిప్‌లకు ప్రభుత్వ భూములు..!

 జగనన్న టౌన్‌షిప్‌లుగా ఇకపై ప్రభుత్వ భూములు వినియోగంలోకి రానున్నాయి. దేవదాయ, ధర్మాదాయ, విద్యాశాఖ, విద్యాసంస్థలు, వక్ఫ్‌, ఇతర ధార్మిక సంస్థల భూములు మినహా ఇంతవరకు ప్రభుత్వ వాడుకలో లేని ఖాళీ భూములను జగనన్న టౌన్‌షిప్‌లుగా వాడుకోనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ… రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తాజాగా ఉత్తర్వులు (193) జారీ చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూములను గుర్తించి జిల్లా కలెక్టర్‌ ముందుస్తుగా పొజిషన్‌ తీసుకొని పురపాలక శాఖకు అప్పగించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.