ఎఆర్‌. రెహమన్‌కి అరుదైన గౌరవం

43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఐఎఫ్‌ఎఫ్‌) వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహమన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఎఆర్‌.రెహమన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. సంగీత రంగంలో తాను చేసిన కృషికి గాను సిఐఎఫ్‌ఎఫ్‌ వేదికగా ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్‌ రంగాలతో పాటు హాలీవుడ్‌ వంటి విభిన్న చలనచిత్ర పరిశ్రమలలో అందించిన సంగీతంతో రెహమన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఫెస్టివల్‌లో దిగిన ఫొటోతో పాటు సినిమా, సిఐఎఫ్‌ఎఫ్‌ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని పోస్ట్‌ చేశారు. ఆరు జాతీయఅవార్డులతో పాటు రెండు అకాడమీ అవార్డులు, రెండు జర్మనీ అవార్డులు, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో పాటు బిఎఎఫ్‌టిఎ అవార్డులను కూడా గతంలో పొందారు. 2010లో దేశంలోని మూడవ అత్యున్నతపురస్కారమైన పద్మ భూషణ్‌ను ప్రదానం చేసింది.