ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు చంద్రబాబు ఫీలవుతున్నారు

కరోనా వైరస్‌ను బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరైన నిర్ణయమంటూ ప్రతిపక్ష టీడీపీ వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!. స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి చంద్రబాబు గెలిచినట్టు ఫీలవుతున్నారు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.